బీఆర్‌ఎ్‌సతో పొత్తుపై త్వరలో స్పష్టత: కూనంనేని
ABN , First Publish Date - 2023-06-26T03:50:17+05:30 IST
బీఆర్‌ఎ్‌సతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణలో పొత్తుల అంశం త్వరలోనే తేలనుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు....
హైదరాబాద్/జహీరాబాద్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణలో పొత్తుల అంశం త్వరలోనే తేలనుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ఆల్‌ఇండియా తంజీం-ఎ ఇన్సాఫ్ ముగింపు మహాసభల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పొత్తుల విషయం చర్చించామని, అది అంతవరకే ఉండిపోయిందని చెప్పారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీఆర్‌ఎ్‌సతో పొత్తులు పెట్టుకునే విషయమై ఆలోచిస్తున్నామన్నారు. కాగా బీజేపీ విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగడుతున్న స్వంతంత్ర జర్నలిస్టు తులసి చందుపై వేధింపులు, ట్రోలింగ్, ప్రాణహాని, దాడుల బెదిరింపులను కూనంనేని తీవ్రంగా ఖండించారు. ఆమె రక్షణ బాధ్యత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు.