Share News

మేడిగడ్డ పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:43 AM

మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిన పిల్లర్ల పునరుద్ధరణ అవకాశాలపై ప్రజల్లో ఆందోళనలున్నందున స్పష్టత ఇవ్వాలని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మేడిగడ్డ పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వాలి

ప్రభుత్వానికి టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిన పిల్లర్ల పునరుద్ధరణ అవకాశాలపై ప్రజల్లో ఆందోళనలున్నందున స్పష్టత ఇవ్వాలని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్‌, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తక్షణం నిపుణుల సమావేశం ఏర్పాటు చేసి కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని నిరంజన్‌ తెలిపారు. అక్టోబరు 21న ఈ ఘటన జరగ్గా.. గత ప్రభుత్వం దాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టినే పునరుద్ధరణ చేస్తుందని అక్టోబరు 28న అప్పటి మంత్రి కేటీఆర్‌ చెప్పారని, ఇప్పుడు ఆ సంస్థ చేతులె త్తేస్తే ఆయన మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు.

Updated Date - Dec 18 , 2023 | 06:36 AM