Share News

క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

ABN , Publish Date - Dec 17 , 2023 | 04:43 AM

ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

22న ఎల్బీ స్టేడియంలో విందుకు సీఎం హాజరు

పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. క్రిస్మస్‌ వేడుకల నిర్వహణపై శనివారం రాత్రి ప్రజాభవన్‌లో ఆయన సెలెబ్రేషన్‌ కమిటీ, అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న మొట్టమొదటి పండుగ క్రిస్మస్‌ అని, దీనిని ఘనంగా నిర్వహించాలని సూచించారు. సంపదను ప్రజలకు పంచడంలో భాగంగా పేద కుటుంబాలకు క్రిస్మస్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లను పంపిణీ చేస్తామని, విందును ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతున్నందున... అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 200 ప్రాంతాల్లో 500 మందికి, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెయ్యి మందికి చొప్పున గిఫ్ట్‌ ప్యాక్‌లను పంపిణీ చేయడంతోపాటు విందును ఏర్పాటు చేయాలని భట్టి సూచించారు. ఈ సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌, ఎంసీహెచ్‌ఆర్‌డీ అడిషనల్‌ డైరెక్టర్‌ బి.ఎం.ఎక్కా, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ కాంతి వెస్లీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి, సైబరాబాద్‌ సీపీ మహంతి, రాచకొండ సీపీ సుధీర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాభవన్‌లో విందుకు సీఎం, జైరాం రమేష్‌ హాజరు

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం విందు ఇచ్చారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు జైరాం రమే్‌షలు హాజరయ్యారు. అలాగే శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు, పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు విందుకు వచ్చారు.

Updated Date - Dec 17 , 2023 | 04:43 AM