ఏఐసీబీ జాతీయ ఉపాధ్యక్షుడిగా చొక్కారావు
ABN , First Publish Date - 2023-10-30T00:39:03+05:30 IST
అఖిల భారత అంధుల సంఘాల సమాఖ్య (ఏ ఐసీబీ) జాతీయ ఉపాధ్యక్షుడిగా డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు ఎన్నికయ్యారు.
ఏఐసీబీ జాతీయ ఉపాధ్యక్షుడిగా చొక్కారావు
నల్లగొండ, అక్టోబరు 29: అఖిల భారత అంధుల సంఘాల సమాఖ్య (ఏ ఐసీబీ) జాతీయ ఉపాధ్యక్షుడిగా డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు ఎన్నికయ్యారు. ఆదివారం న్యూఢిల్లీలోని చాణక్యపురిలో విశ్వయువక కేంద్రంలో నిర్వహించిన ఏఐసీబీ జాతీయ సమ్మేళనంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అదే విధంగా కార్యవర్గసభ్యులుగా రాత్లావత స్వామి నాయక్, డి. రేణుకను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీబీ జాతీయ అధ్యక్షుడు అనిల్ అనిజ, సెక్రటరీ జనర్నల్ జవహర్‌లాల్ కౌల్ తదితరులు పాల్గొన్నారు.