చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2023-04-19T00:12:00+05:30 IST

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కావడంతో అంతరాష్ట్ర సరిహద్దు కలిగిన జిల్లాలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని డీజీ పీ అంజనీకుమార్‌ అన్నారు. మంగళవారం జిల్లాఅధికారులతో హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా చెక్‌ పోస్టుల వద్ద పగలు, రాత్రి అప్రమత్తంగా ఉండాలన్నారు.

చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి
ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న డీజీపీ అంజనీకుమార్‌

డీజీపీ అంజని కుమార్‌

సూర్యాపేటక్రైం, ఏప్రిల్‌ 18: రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కావడంతో అంతరాష్ట్ర సరిహద్దు కలిగిన జిల్లాలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని డీజీ పీ అంజనీకుమార్‌ అన్నారు. మంగళవారం జిల్లాఅధికారులతో హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా చెక్‌ పోస్టుల వద్ద పగలు, రాత్రి అప్రమత్తంగా ఉండాలన్నారు. అక్రమ, కల్తీ మద్యం రాష్ట్రంలోకి రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోయిన, దొంగతనానికి గురైన మొబైల్‌ ఫోన్‌లు గుర్తించడంకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చిన సీఈఐఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిపోయే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సివిల్‌సప్లయి, ఎక్సైజ్‌ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ అక్రమ రవాణా అడ్డుకుంటున్నామన్నారు. కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అనిత, డీఎస్పీ లు నాగభూషణం, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, నరసిం హ, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-04-19T00:12:00+05:30 IST