‘‘తుపాకులగూడెం’ డీపీఆర్‌ను పరిశీలించండి

ABN , First Publish Date - 2023-01-27T03:01:36+05:30 IST

తుపాకులగూడెం(సమ్మక్క సాగర్‌) ప్రాజెక్టు డీపీఆర్‌ పరిశీలన పూర్తి చేయాలని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)ను తెలంగాణ కోరింది. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సలహా మండలి(టీఏసీ) క్లియరెన్స్‌ ఇచ్చేలోపు ఛత్తీస్‌గఢ్‌ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) తెచ్చుకుంటామని.............

‘‘తుపాకులగూడెం’ డీపీఆర్‌ను పరిశీలించండి

టీఏసీక్లియరెన్స్‌ ఇచ్చే లోపు ఛత్తీస్‌గఢ్‌ నుంచి

ఎన్‌వోసీ తెచ్చుకుంటాం.. సీడబ్ల్యూసీకి తెలంగాణ లేఖ

హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): తుపాకులగూడెం(సమ్మక్క సాగర్‌) ప్రాజెక్టు డీపీఆర్‌ పరిశీలన పూర్తి చేయాలని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)ను తెలంగాణ కోరింది. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సలహా మండలి(టీఏసీ) క్లియరెన్స్‌ ఇచ్చేలోపు ఛత్తీస్‌గఢ్‌ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) తెచ్చుకుంటామని, ఈ లోగా డీపీఆర్‌ను పరిశీలించాలని విన్నవిస్తూ సీడబ్ల్యూసీకి లేఖ రాఖ రాసింది. పవీ నర్సింహారావు కాంతనపల్లి(తుపాకులగూడెం) సుజలస్రవంతి ప్రాజెక్టుకు సమ్మక్క సాగర్‌గా నామకరణం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఛత్తీస్‌గఢ్‌ లో ముంపు లేదని ఆ రాష్ట్రం నుంచి ఎన్‌వోసీ తెస్తేనే క్లియరెన్స్‌ ఇస్తామని సీడబ్ల్యూసీ తేల్చిన విషయం విదితమే. అయితే, ఎన్‌వోసీ కోసం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో మూడునెలలుగా సంప్రదింపులు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి రాసిన లేఖలో పేర్కొంది. ఎన్‌వోసీ ఇవ్వాలని కోరుతూ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేసింది. శ్రీరాంసాగర్‌ స్టేజ్‌-1, 2తో పాటు దేవాదుల ఆయకట్టు స్థిరీకరణ, దారివెంట గ్రామాలకు తాగునీటిని అందించేందుకు తుపాకులగూడెం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లభించిన విషయాన్ని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-01-27T03:01:37+05:30 IST