గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్‌గా రజినీ సాయిచంద్ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2023-07-21T03:15:19+05:30 IST
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ(స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్) చైర్‌పర్సన్‌గా వేద రజినీ సాయిచంద్ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్, అఫ్జల్‌గంజ్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ(స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్) చైర్‌పర్సన్‌గా వేద రజినీ సాయిచంద్ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్‌రావు, గిడ్డంగుల సంస్థ ఎండీ జితేందర్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన రజినీకి మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మంత్రులు,ప్రజా ప్రతినిధులు వేర్వేరుగా రజినీకి స్వయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, తనపై నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రజనీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.