బీజేపీ మద్దతుతోనే చంద్రబాబు అరెస్టు : సురవరం
ABN , First Publish Date - 2023-09-18T04:38:55+05:30 IST
కేంద్రంలోని బీజేపీ మద్దతుతోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని అరెస్టు చేశారని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని బీజేపీ మద్దతుతోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని అరెస్టు చేశారని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ముందు ప్రతిపక్షం, ఆ వెంటనే జగన్ పనిపట్టేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాదకర రాజకీయ ఎత్తుగడలకు బీజేపీ తెరలేపిందని హెచ్చరించారు.