జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సవాలు విసిరిన మేథ్స్‌!

ABN , First Publish Date - 2023-06-05T03:15:17+05:30 IST

ఐఐటీలు సహా మరికొన్ని ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్‌ సంస్థల్లో ప్రవేశానికి ఉద్దేశించి ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఏమంత సులువుగా లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మేథ్స్‌ సవాలు విసిరిందని

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సవాలు విసిరిన మేథ్స్‌!

హైదరాబాద్‌, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): ఐఐటీలు సహా మరికొన్ని ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్‌ సంస్థల్లో ప్రవేశానికి ఉద్దేశించి ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఏమంత సులువుగా లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మేథ్స్‌ సవాలు విసిరిందని కొందరు విద్యార్థులు చెప్పడం గమనార్హం. ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన రెండు సెషన్స్‌ మోడరేట్‌ నుంచి కష్టంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రెండు సెషన్స్‌లోనూ కొందరు విద్యార్థులు చెప్పిన దాని ప్రకారం ఫిజిక్స్‌ సులువుగా, కెమిస్ట్రీ మధ్యస్థంగా ఉండగా, మేథ్స్‌ సాపేక్షంగా కష్టంగా ఉంది. ప్రముఖ కోచింగ్‌ సంస్థ ఫిట్జీ విశ్లేషణ ప్రకారం ఒక్కోటి మూడు గంటల పేపర్‌. కాగా ఒక్కో సబ్జెక్టులో 60 చొప్పున మూడింటికి కలిపి 180 మార్కులకు ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టులో 17 ప్రశ్నలు అడిగారు. మొత్తం 51 ప్రశ్నలు ఇచ్చారు. ప్రతి సబ్జెక్టులో నాలుగు సెక్షన్లు ఉన్నాయి. మూడో సెక్షన్‌కు 24 మార్కులు కేటాయించారు. మిగిలిన మూడు సెక్షన్లకు గానూ ఒక్కోదానిలో 12 చొప్పున 36 మార్కులకు ప్రశ్నలు అడిగారు.

Updated Date - 2023-06-05T03:15:17+05:30 IST