రాష్ట్ర డిస్కమ్‌లలోకి కేంద్రం

ABN , First Publish Date - 2023-06-01T03:20:39+05:30 IST

తెలంగాణ విద్యుత సంస్థల్లోకి కేంద్రం అడుగుపెట్టింది. డిస్కంలకు రుణాలు మంజూరు చేస్తున్న సందర్భంగా విధించే షరతులను ఏ విధంగా అమలు చేస్తున్నదీ పరిశీలించడానికి కేంద్రం తన ప్రతినిధులను నియమించింది.

రాష్ట్ర డిస్కమ్‌లలోకి కేంద్రం

రెండు డిస్కమ్‌లలోనూ ఇద్దరేసి డైరెక్టర్ల నియామకం

రుణాల షరతుల అమలు తీరు పరిశీలనే లక్ష్యం

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యుత సంస్థల్లోకి కేంద్రం అడుగుపెట్టింది. డిస్కంలకు రుణాలు మంజూరు చేస్తున్న సందర్భంగా విధించే షరతులను ఏ విధంగా అమలు చేస్తున్నదీ పరిశీలించడానికి కేంద్రం తన ప్రతినిధులను నియమించింది. తమ ప్రతినిధులకు విధిగా పాలకమండలిలో చోటివ్వాలని, ఆ మేరకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్రం గత కొన్నేళ్లుగా పట్టుబడుతోంది. చివరకు ఆ ఒత్తిడి ఫలించింది. దాంతో డిస్కమ్‌ల పాలక మండళ్లలో రూరల్‌ ఎలకి్ట్రఫికేషన కార్పొరేషన(ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స కార్పొరేషన(పీఎ్‌ఫసీ)కి చెందిన ప్రతినిధులను డైరెక్టర్లుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. తాజా నిర్ణయంతో ప్రతి పాలక మండలి సమావేశంలో చర్చించే విధానపరమైన అంశాలను కేంద్రం తెలుసుకోనుంది. పాలక మండలి సమావేశానికి ముందు ఎజెండాను విధిగా వీరికి పంపించాల్సి ఉంటుంది. సమావేశంలో కూడా వీరు షరతుల అమలు ఎందాకా వచ్చిందని ప్రశ్నించే అవకాశం ఉంది.

Updated Date - 2023-06-01T03:20:39+05:30 IST