వైభవంగా ఆషాడమాస బోనాల వేడుకలు

ABN , First Publish Date - 2023-06-26T01:03:50+05:30 IST

ఆషాడమాస బోనాలను ఆదివారం భువనగిరిలో వైభవంగా నిర్వహించారు. కుమ్మరివాడ నుంచి ఆజాద్‌ రోడ్డులోని పోచమ్మ దేవాలయం వరకు అట్టహాసంగా బోనాల ఊరేగింపు నిర్వహించి నైవేధ్యం సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి వడిబియ్యం, తదితర మొక్కులు చెల్లించుకున్నారు.

వైభవంగా ఆషాడమాస బోనాల వేడుకలు

భువనగిరి టౌన్‌, జూన్‌ 25: ఆషాడమాస బోనాలను ఆదివారం భువనగిరిలో వైభవంగా నిర్వహించారు. కుమ్మరివాడ నుంచి ఆజాద్‌ రోడ్డులోని పోచమ్మ దేవాలయం వరకు అట్టహాసంగా బోనాల ఊరేగింపు నిర్వహించి నైవేధ్యం సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి వడిబియ్యం, తదితర మొక్కులు చెల్లించుకున్నారు. బాణాసంచా, డప్పు చప్పుళ్లు, శివసత్తుల శిగాల మధ్య సాగిన ఊరేగింపునకు అడుగడుగునా స్వాగతం పలికారు. కుమ్మరి సంఘం అధ్యక్షుడు తాడూరి కిష్టయ్య, మల్లేష్‌, బాలసత్తి, మడికొండ మల్లేష్‌, తాడూరి అనితా నర్సింహ, తాడూరి భిక్షపతి తదితరులు ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2023-06-26T01:03:50+05:30 IST