ప్రజల డిమాండ్ మేరకే 111 జీవో రద్దు:బీఆర్‌ఎస్
ABN , First Publish Date - 2023-05-26T03:06:37+05:30 IST
ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకే తమ ప్రభుత్వం 111 జీవోను రద్దు చేసిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, ..

హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకే తమ ప్రభుత్వం 111 జీవోను రద్దు చేసిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, సుధీర్‌రెడ్డి చెప్పారు. దీనిపై ఏమాత్రం అవగాహన లేకుండా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ నేత రఘునందన్‌రావు ఆరోపణలు చేయడం తగదని వారు హితవు పలికారు. 111 జీవోను ఎత్తేయొద్దని ఆ 84 గ్రామాల ప్రజలకు చెప్పే దమ్ము కాంగ్రెస్, బీజేపీలకు ఉందా అని వారు సవాల్ విసిరారు. ఓఆర్‌ఆర్ బిడ్డింగ్ కేంద్రం నిబంధనలకు లోబడే జరిగిందని, పది శాతం నిధులు కట్టాలని కేసీఆర్ ఒత్తిడి చేశారనే వదంతులు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు సృష్టించాయని దుయ్యబట్టారు.