క్యాంప్ ఆఫీసు వేదికగా పాలన
ABN , First Publish Date - 2023-12-10T23:01:30+05:30 IST
క్యాంపు కార్యాలయం అంటే ప్రజల దని, కార్యాలయం వేదికగానే పాలన సాగుతుందని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
ఫ ప్రజల సమక్షంలోనే యంత్రాంగంతో ఇక్కడే సమీక్ష
ఫ ప్రతీకార చర్యలుండవు.. అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు
ఫ వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు
ఫ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్, డిసెంబరు 10 : క్యాంపు కార్యాలయం అంటే ప్రజల దని, కార్యాలయం వేదికగానే పాలన సాగుతుందని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీలకతీతంగా ప్రజలు నేరుగా క్యాంప్ కార్యాలయం వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. అధికారులు ఇక్కడికే రావాలని, తన ఇంటికి ఎవరూ రావద్దని అన్నారు. ఇక్కడే ప్రజల సమక్షంలో ప్రజా సమస్యలపై చర్చిద్దామని, ఉన్నతాధికారులైతే తానే వారి కార్యాలయాల వద్దకు వెళతానని స్పష్టం చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ పాలనలో ప్రతీకార చర్యలు తీసుకోవాలని అనుకోవడం లేదని, ఎవరైనా చట్టవ్య తిరేక చర్యలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజలకోసం తప్ప, కుటుంబం కోసమో, వ్యక్తుల కోసమో పనిచేయదన్నారు. ఇకపై ఎవరూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయవద్దని, ఫ్లెక్సీ కల్చర్‌కు స్వస్తి పలుకుదామని చెప్పారు. వ్యాపారులు స్వేచ్ఛగా చట్టపరమైన వ్యాపారలను చేసుకోవచ్చని సూచించారు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన మహబూబ్‌నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వినోద్‌కుమార్, హర్షవర్ధన్‌రెడ్డి, బెన హర్, రాధాఅమర్, ఆనంద్‌కుమార్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, లక్ష్మణ్ యాద వ్, బెక్కరి మధు, వనంత, బెక్కరి అనిత, లింగం, సాయిబాబ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్, యంత్రాంగం
క్యాంప్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని జిల్లా కలెక్టర్ జి రవినాయక్, డీఎస్పీ మహేశ్, అధికారులు కలిసి పూల బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనను శాలువాలతో సత్కరించారు.