ప్లాస్టిక్‌ నియంత్రణకు బర్తన్‌ బ్యాంకులు

ABN , First Publish Date - 2023-09-22T02:42:27+05:30 IST

స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి కల్పించడంతోపాటు ప్లాస్టిక్‌ను నిషేధించడంలో భాగంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో బర్తన్‌ ...

ప్లాస్టిక్‌ నియంత్రణకు బర్తన్‌ బ్యాంకులు

అన్ని జిల్లాల్లో ఏర్పాటు: సీడీఎంఏ పమేలా సత్పతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి కల్పించడంతోపాటు ప్లాస్టిక్‌ను నిషేధించడంలో భాగంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో బర్తన్‌ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు మెప్మా ఎండీ, సీడీఎంఏ(కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌) పమేలా సత్పతి తెలిపారు. ఈ మేరకు సీడీఎం కార్యాలయం లో ఏర్పాటు చేసిన బర్తన్‌ బ్యాంకును ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రైవేటు ఫంక్షన్లు, సామాజిక, మతపరమైన కార్యక్రమాల సమయంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వాడకుం డా ఈ బ్యాంకు ద్వారా స్టెయిన్‌లె్‌స స్టీలు ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు, స్పూన్లు వంటివి అందించనున్నట్లు తెలిపారు. నామమాత్రపు అద్దెతో 500-750 మంది పాల్గొనే కార్యక్రమాలకు సామాగ్రిని అందించేలా ఈ బ్యాంక్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే 32 జిల్లా కేంద్రాల్లోని మునిసిపాలిటీ కార్యాలయాల్లో బర్తన్‌ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నామని పమేలా తెలిపారు.

Updated Date - 2023-09-22T02:42:27+05:30 IST