డీఎస్సీకి బీటెక్‌ బీఎడ్‌ అభ్యర్థులు అర్హులే

ABN , First Publish Date - 2023-10-12T04:36:44+05:30 IST

బీటెక్‌ అర్హతతో బీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సంబం ధిత సబ్జెక్టులతో బీటెక్‌

డీఎస్సీకి బీటెక్‌ బీఎడ్‌ అభ్యర్థులు అర్హులే

హైదరాబాద్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): బీటెక్‌ అర్హతతో బీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సంబం ధిత సబ్జెక్టులతో బీటెక్‌ పూర్తిచేసి బీఎడ్‌లో సంబంధిత మెథడాలజీతో కోర్సు ను పూర్తి చేసిన వారు డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హులని, వారు ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు బుధవారం సర్క్యులర్‌ను జారీ చేసింది.

Updated Date - 2023-10-12T04:36:44+05:30 IST