Share News

అభివృద్ధిని చూసి బీఆర్‌ఎ్‌సకు అండగా ఉండాలి : లింగయ్య

ABN , First Publish Date - 2023-10-17T00:25:51+05:30 IST

అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా ఉండాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. బీఫాం అందుకున్న అనంతరం సోమవారం మండలంలోని చెర్వుగట్టులో గల తన ఇష్టదైవమైన పార్వతీ జడల రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చే సి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించా రు.

 అభివృద్ధిని చూసి బీఆర్‌ఎ్‌సకు అండగా ఉండాలి : లింగయ్య
ప్రచార రథాలకు జరిగిన పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లింగయ్య

అభివృద్ధిని చూసి బీఆర్‌ఎ్‌సకు అండగా ఉండాలి : లింగయ్య

నార్కట్‌పల్లి, నకిరేకల్‌, అక్టోబరు 16: అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా ఉండాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. బీఫాం అందుకున్న అనంతరం సోమవారం మండలంలోని చెర్వుగట్టులో గల తన ఇష్టదైవమైన పార్వతీ జడల రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చే సి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించా రు. అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చే విధం గా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో ఉందని ఆయన అన్నారు. బీఫాం అందుకున్న అనంతరం సోమవారం మండలంలోని చెర్వుగట్టులో గల తన ఇష్టదైవమైన పార్వతీ జడల రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించే ఎన్నికల ప్రచారరథాలకూ ప్ర త్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లింగయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహం, ప్రజల దీవెనలు భగవంతుని ఆశీస్సులు, కార్యకర్తల కృషితో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఐదేళ్ల కాలంలో తా ను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్నారు. నకిరే కల్‌లోని కనకదుర్గమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజ లు చేసి ర్యాలీ నిర్వహించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృ ద్ధి చేసిన ఎమ్మెల్యే లింగయ్యను మరోసారి గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ప్రజారంజకంగా ఉందని అ న్నా రు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన రేగట్టె మల్లిఖార్జునరెడ్డి, ఎంపీపీ లు సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, జ్యోతి, లక్ష్మి, కట్టంగూరు జడ్పీటీసీ తరాల బలరాం, పార్టీ మండల శాఖల అధ్యక్షులు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, మందడి ఉదయ్‌రెడ్డి, మ ల్గ బాలకృష్ణ, మేకల రాజిరెడ్డి, యానాల అశోక్‌రెడ్డి, పు ల్లెంల ముత్తయ్య, చిరుమర్తి యాదయ్య, కొండూరు శంకరయ్య, మనోజ్‌, శ్రీధర్‌, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-10-17T00:25:51+05:30 IST