బీఆర్‌ఎస్ నేతలు జైలుకెళ్లడం ఖాయం
ABN , Publish Date - Dec 26 , 2023 | 01:24 AM
బీఆర్‌ఎస్ పార్టీలో అవినీతికి పాల్పడిన నాయకులు త్వరలో జైలుకెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇకపై ఉండదని,
త్వరలో ఆ పార్టీ నాలుగు ముక్కలవుతుంది
రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ దివాలా తీయించింది
మరో 20 ఏళ్లు కాంగ్రె్‌సదే అధికారం: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీలో అవినీతికి పాల్పడిన నాయకులు త్వరలో జైలుకెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇకపై ఉండదని, నాలుగు ముక్కలవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని చెప్పారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం క్రిస్మస్ వేడుకలతో పాటు పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని, అన్ని ప్రభుత్వ శాఖలను అప్పుల కుప్పగా మార్చిందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిపై వేసిన సిటింగ్ జడ్జి విచారణ నివేదిక రాగానే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.