బీఆర్‌ఎస్ బీసీల వ్యతిరేక పార్టీ!
ABN , First Publish Date - 2023-08-27T04:06:58+05:30 IST
బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్ శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు.
ఆత్మాభిమానం చంపుకోలేక రాజీనామా చేస్తున్నా
మాజీ మంత్రి కృష్ణాయాదవ్ వెల్లడి
త్వరలో బీజేపీలో చేరిక, అంబర్‌పేట నుంచి పోటీ?
పంజాగుట్ట/బర్కత్‌పుర/నల్లకుంట, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్ శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఆత్మాభిమానాన్ని చంపుకొని బీఆర్‌ఎ్‌సలో ఉండలేనని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ‘అంబర్‌పేట టికెట్ ఇస్తామని 2018లో కేసీఆర్ హామీ ఇచ్చి.. వేరే అభ్యర్థికి బీ ఫాం ఇచ్చారు. అయినా పార్టీలోనే ఉన్నా. కానీ, ఈసారి కూడా ఇవ్వలేదు. ఆ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ అని అర్థమైంది. భూస్వాములకు, పెత్తందారులకు, పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించే పార్టీలో ఒక బీసీ నాయకుడిగా కొనసాగడం సరికాదనే నిర్ణయానికి వచ్చి పార్టీకి రాజీనామా చేస్తున్నా’ అని తెలిపారు. ఏ పార్టీ బీసీలకు అవకాశం కల్పిస్తుందో అందులో చేరతానన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో కృష్ణాయాదవ్ బీజేపీలో చేరతారని సమాచారం. అంబర్‌పేట నియోజకవర్గం టికెట్ ఇస్తామని బీజేపీ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.