పాతగుట్టలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

ABN , First Publish Date - 2023-02-01T01:01:12+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనృసింహుడి పుణ్యక్షేత్రం లో మంగళవారం వార్షిక తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలకు అర్చకబృం దం పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో శ్రీకారం పలికారు. విశ్వశాంతి, లోకకల్యాణార్థం ప్రతీ ఏటా స్వామి సన్నిధిలో నిర్వహించే తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాతగుట్ట ప్రధానాలయంలో కొలువుదీరిన మూలమూర్తులను కొలిచిన ఆచార్యులు ఉత్సమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన శేషవాహన సేవపై తీర్చిదిద్ది ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు.

పాతగుట్టలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

శాస్త్రోక్తంగా క్షేత్రపాలకుడికి ఆకుపూజ

స్వామివారి సేవలో ప్రముఖులు

యాదగిరిగుట్ట, జనవరి 31: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనృసింహుడి పుణ్యక్షేత్రం లో మంగళవారం వార్షిక తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలకు అర్చకబృం దం పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో శ్రీకారం పలికారు. విశ్వశాంతి, లోకకల్యాణార్థం ప్రతీ ఏటా స్వామి సన్నిధిలో నిర్వహించే తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాతగుట్ట ప్రధానాలయంలో కొలువుదీరిన మూలమూర్తులను కొలిచిన ఆచార్యులు ఉత్సమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన శేషవాహన సేవపై తీర్చిదిద్ది ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు. విశ్వక్సేనుడికి తొలి పూజలతో ఉత్సవ ఆరంభ పర్వాలను నిర్వహించారు. స్వస్తిపుణ్యాహవాచన పూజలు జరిపిన పూజారులు ఆలయ పరిసరాలను మంత్ర జలాలతో శుద్ధి చేశారు. అనంతరం వేదమంత్ర పఠనాల నడుమ స్వామి, అమ్మవార్లకు కంకణధారణ చేసి నిర్వాహకులకు, రుత్వికులకు దీక్షాకంకణఽధారణ చేశారు. సాయంత్రం వేళ అంకురార్పణ, మృత్స్యంగ్రహణ పర్వాలను సంప్రదాయరీతిలో నిర్వహించారు. శ్రీవైష్ణవ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల మొదటి రోజున సాయంత్రం వేళ పవిత్రీకరించిన పుట్ట మట్టిలో నవధాన్యాలను నిర్ధేశించిన వేద మంత్రాలతో తడిపి, మొలకెత్తించే ఘట్టమే అంకురార్పణ పర్వం. భూమిపై గల క్షేత్రాలు పచ్చని పంటలతో సస్యశ్యామలంగా వర్ధిల్లింపడానికి భగవానుడిని అనుగ్రహింపజేసేందుకు ఉత్సవ ఆరంభం రోజున మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను నిర్వహిస్తారని ఆచార్యులు వివరించారు. ఈ విశేష వేడుకలను దేవస్థాన ప్రధానార్చకుడు మరింగంటి మోహనాచార్యులు, అర్చకబృందం నిర్వహించగా, దేవస్థాన ఈవో గీతారెడ్డి, డీఈవో దోర్భల భాస్కరశర్మ సిబ్బంది పాల్గొన్నారు.

స్వామివారి సేవలో ప్రముఖులు

నృసింహుడిని రాష్ట్ర ఆర్ఘిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, యాదాద్రి రేంజ్‌ డీసీపీ రాజే్‌షచంద్ర దర్శించుకున్నారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా, వీరు ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకుని ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం అర్చకులు వీరికి ప్రాకార మండపంలో ఆశీర్వచనం జరపగా, దేవస్థాన అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

శాస్త్రోక్తంగా క్షేత్రపాలకుడికి ఆకుపూజ

యాదగిరిగుట్టలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మం గళవారం నాగవల్లీ దళార్చనలు, స్వామికి నిత్యపూజలు శాస్త్రోక్తంగా జరిగా యి. ప్రధానాలయంలోని లక్ష్మీనృసింహులకు, శివాలయంలోని పార్వతీరామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.17,66,339 ఆదాయం సమకూరింది.

Updated Date - 2023-02-01T01:01:14+05:30 IST