అమెరికాలో బోయగూడెం యువకుడి ప్రతిభ

ABN , First Publish Date - 2023-07-02T23:58:14+05:30 IST

మండలంలోని బోయగూ డెం గ్రామానికి చెందిన నెమలి జీ వితే్‌షరెడ్డి అనే యువకుడు అమెరికాలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీల్లో ప్రతి భ చాటాడు.

 అమెరికాలో బోయగూడెం యువకుడి ప్రతిభ
తండ్రి మాధవరెడ్డితో జీవితే్‌షరెడ్డి

అమెరికాలో బోయగూడెం యువకుడి ప్రతిభ

వాలీబాల్‌ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపిక

తిరుమలగిరి(సాగర్‌), జూలై 2: మండలంలోని బోయగూ డెం గ్రామానికి చెందిన నెమలి జీ వితే్‌షరెడ్డి అనే యువకుడు అమెరికాలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీల్లో ప్రతి భ చాటాడు. ఇటీవల నేషనల్‌ జూనియర్స్‌ వాలీబాల్‌ 2022-23 పోటీలకు అతను కాలిఫోర్నియా స్టేట్‌ జట్టుకు ఎంపికై జాతీయస్థాయి పోటీల్లో పా ల్గొంటున్నాడు. జట్టును గెలిపించడంలో విశేషంగా రాణిస్తున్నాడు. బోయగూడెం కు చెందిన నెమలి మాధవరెడ్డి అనే ఎనఆర్‌ఐ కొన్నేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఉ ద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. ఈ క్రమంలో అతని కుమారుడు స్కూల్‌స్థాయి నుంచే వాలీబాల్‌ పోటీల్లో చక్కని ప్రతిభ చాటుతూ జా తీయస్థాయికి ఎదిగాడు.

Updated Date - 2023-07-02T23:58:14+05:30 IST