ఆవులపల్లి రిజర్వాయర్‌ పనులను అడ్డుకోండి

ABN , First Publish Date - 2023-05-26T03:17:26+05:30 IST

కృష్ణానదిపై అనుమతిలేకుండా చేపడుతున్న ఆవులపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులను వెంటనే నిలిపివేయాలని కృష్ణా నదీ

ఆవులపల్లి రిజర్వాయర్‌ పనులను అడ్డుకోండి

కేఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదిపై అనుమతిలేకుండా చేపడుతున్న ఆవులపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులను వెంటనే నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)ను తెలంగాణ కోరింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీ చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌కు తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్‌) సి.మురళీధర్‌ లేఖ రాశారు. గాలేరు నగరి-హంద్రీనీవా సుజల స్రవంతి పథకాల అనుసంధానంలో భాగంగా చిత్తూరు జిల్లా సోమాల మండలంలోని ఆవులపల్లిలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులను ఏపీ చేపడుతోందని, ఈ పనులను నిలిపివేయాలని ఎన్జీటీ తీర్పు ఇచ్చినా పనులు చేపడుతున్నారని గుర్తు చేశారు.

Updated Date - 2023-05-26T03:17:26+05:30 IST