కోకాపేటలో సర్వాయి పాపన్న గౌడ్ భవన నిర్మాణానికి భూమిపూజ
ABN , First Publish Date - 2023-06-26T02:14:13+05:30 IST
హైదరాబాద్ శివారు కోకాపేట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు.
నార్సింగ్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారు కోకాపేట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీనివా్‌సగౌడ్, గంగుల కమాలకర్‌తో పాటు ఎమ్మెల్యేలు టి.ప్రకా్‌షగౌడ్, వివేకానందగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు ఎనలేని అవకాశాలు, ఉపాధి పథకాలు అందిస్తోందన్నారు. తమది ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని చెప్పారు. ఈ కార్యక్రమంలో భిక్షమయ్యగౌడ్, సత్యనారాయణగౌడ్, రాజేశంగౌడ్, పల్లె రవి, ఆంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.