Share News

భట్టివిక్రమార్కకు 2వ అంతస్తు

ABN , First Publish Date - 2023-12-11T03:10:32+05:30 IST

రాష్ట్ర మంత్రులకు సచివాలయంలో కార్యాలయాలను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

భట్టివిక్రమార్కకు  2వ అంతస్తు

ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 4వ అంతస్తులో కార్యాలయం

సీతక్కకు మొదటి, కొండా సురేఖకు 4వ అంతస్తులో

మంత్రులకు సచివాలయంలో కార్యాలయాల కేటాయింపు

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రులకు సచివాలయంలో కార్యాలయాలను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. వీరిలో కొంత మంది ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. మిగిలిన వారందరికీ సచివాలయంలో కార్యాలయాలను కేటాయిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌, 2వ, 3వ, 4వ, 5వ అంతస్తుల్లోని గదులను మంత్రులకు కేటాయించారు.

Updated Date - 2023-12-11T03:10:33+05:30 IST