9 నుంచి పాదయాత్రలో భట్టి
ABN , First Publish Date - 2023-03-02T03:13:38+05:30 IST
ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి తలపెట్టిన కాంగ్రెస్ తెలంగాణ పోరు యాత్రలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క భాగస్వాములు కానున్నారు.
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి తలపెట్టిన కాంగ్రెస్ తెలంగాణ పోరు యాత్రలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క భాగస్వాములు కానున్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్‌లో భాగంగా బాసర నుంచి హైదరాబాద్ వరకు తలపెట్టిన ఈ యాత్ర మార్చి 9 నుంచి 15 వరకు జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 15 కల్లా పాదయాత్ర పూర్తయ్యేలా రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ నెల 9న యాత్రలో చేరి, 15 వరకూ కొనసాగేందుకు భట్టివిక్రమార్క అంగీకరించారు.