Share News

అసెంబ్లీ ఎన్నికల బరిలో భారత చైతన్య యువజన పార్టీ

ABN , First Publish Date - 2023-10-26T04:52:15+05:30 IST

తెలంగాణలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీవై ఒంటరిగా పోటీలో నిలుస్తుందని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల బరిలో భారత చైతన్య యువజన పార్టీ

నవంబరు 1న అభ్యర్థుల ప్రకటన

పదేళ్లుగా రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం

బీసీవై జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌

హైదరాబాద్‌లో బీసీవై రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీవై ఒంటరిగా పోటీలో నిలుస్తుందని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికపై 3-4 రోజులు కసరత్తు నిర్వహించి నవంబరు 1న వివరాలు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్‌కాలనీలో బీసీవై రాష్ట్ర కార్యాలయాన్ని బుధవారం రామచంద్రయాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, దశాబ్దకాలంగా దగాపడ్డ రైతు, యువ త కోసం రానున్న ఎన్నికల్లో బీసీవై పోటీకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. విద్య, వైద్య విధానంలో మార్పుతో పాటు అన్నిరంగాల అభివృద్ధే లక్ష్యంగా బీసీవై మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో రాజకీ య దోపిడీని అరికట్టేందుకు పోరాడతామని చెప్పారు. చెరుకు రైతు గుర్తును పార్టీకి కేటాయించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అన్నివర్గాల మద్దతుతో ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతామన్నారు.

పదే ళ్ల తెలంగాణలో ఏ ఒక్క వర్గానికి, యువతకు బీఆర్‌ఎస్‌ న్యాయం చేయలేదని.. రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, యువతతో పాటు అన్ని రంగాలు అన్యాయానికి గురయ్యాయన్నారు. ఎంతోమంది ప్రాణాత్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో 82 శాతమున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చట్టసభల్లో స్థానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షాలు కేసీఆర్‌ ఇచ్చే కాసులు, కాంట్రాక్టులు తీసుకుంటూ మౌనం వహిస్తున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో రాజకీయ మార్పు రావాలని తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. ఏపీతో పాటు తెలంగాణలో విస్తృతంగా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. భవిష్యత్తులో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరిస్తామని పేర్కొన్నారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. కాగా, బీసీవై పార్టీ రాష్ట్రకార్యాలయం ప్రారంభోత్సవంలో భారీసంఖ్యలో నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-26T04:52:15+05:30 IST