స్థానిక ఎమ్మెల్యే అంటే అంత అలుసా?

ABN , First Publish Date - 2023-03-31T02:50:44+05:30 IST

: స్థానిక ఎమ్మెల్యేనైనా భద్రాచలంలో జరిగే శ్రీ సీతా రామచంద్రస్వామి కల్యాణం జరిగే ప్రాంగణంలో తనకు కనీసం కూర్చోడానికి చోటు కూడా చూపలేదని, ఇబ్బందులు పడుతూనే ఓ మూలన కూర్చొని కల్యాణం వీక్షించి ....

స్థానిక ఎమ్మెల్యే అంటే అంత అలుసా?

కల్యాణం సమయంలో ప్రోటోకాల్‌ ఉల్లంఘించారు

కలెక్టర్‌పై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆగ్రహం

భద్రాచలం, మార్చి 30: స్థానిక ఎమ్మెల్యేనైనా భద్రాచలంలో జరిగే శ్రీ సీతా రామచంద్రస్వామి కల్యాణం జరిగే ప్రాంగణంలో తనకు కనీసం కూర్చోడానికి చోటు కూడా చూపలేదని, ఇబ్బందులు పడుతూనే ఓ మూలన కూర్చొని కల్యాణం వీక్షించి వచ్చానని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం కనీస ప్రోటోకాల్‌ కూడా పాటించకుండా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి గోత్రనామాలు చదివిన దేవస్థానం అర్చకులు తన గోత్రనామాలను మాత్రం చదవలేదని, భద్రాచలంలో ప్రథమ పౌరుడిగా త నకిచ్చే మర్యాద ఇదేనా ? అని ఆయన ప్రశ్నించారు. నవమి ఏర్పాట్ల పర్యవేక్షణలో భద్రాద్రి కలెక్టర్‌ వైఫల్యం చెందారని ఎమ్మెల్యే వీరయ్య విమర్శించారు.

Updated Date - 2023-03-31T02:50:44+05:30 IST