Share News

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:08 AM

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించినప్పుడే మంచి గుర్తింపు వస్తుందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

 ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ, డిసెంబరు 25: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించినప్పుడే మంచి గుర్తింపు వస్తుందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మర్రిగూడ సమీపంలోని అద్దంకి బైపాస్‌ రోడ్డులో గల గ్రా మీణ సృశుత వైద్యుల సంఘ భవనంలో నిర్వహించిన సంఘ వార్షికోత్సవ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలన రావడానికి ఆర్‌ఎంపీ డాక్టర్లు కృషి చేశారని గుర్తుచేశారు. ఆర్‌ఎంపీ సమస్యల పరిష్కారం కోసం తమవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లెపల్లి శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి గొంగిడి నర్సింహారెడ్డి, రాష్ట్ర ప్రతినిధులు నేతి రాజేశ్వర్‌రావు, హనుమంతరావు, సత్యనారాయణచారి, నర్సింహ, భిక్షం పాల్గొన్నారు.

గెస్ట్‌హౌస్‌ పనుల పరిశీలన

నల్లగొండ టౌన: నల్లగొండ పట్టణంలో క్లాక్‌టవర్‌ సెంటర్‌లో నిర్మాణంలో ఉ న్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.6.25 కోట్లతో నిర్మిస్తున్న ఆర్‌ అం డ్‌బి గెస్ట్‌హౌస్‌ను వీఐపీ అతిథిగృహంగా తీర్చిదిద్దాలని ఇంజనీర్లను ఆదేశించారు. అంతేకాక ఎంట్రెన్స గేట్‌ పెద్దగా ఉండేటట్లు చూడాలని ఆయన సూచించారు. నిర్మాణాన్ని ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

Updated Date - Dec 26 , 2023 | 12:08 AM