బీఈఈ మీడియా సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:11 AM
కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సంస్థ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారుగా అస్పరి చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు.
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సంస్థ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారుగా అస్పరి చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. బీఈఈ సెక్రటరీ మిలింద్ దేవరా సమక్షంలో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే ఢిల్లీలోని కార్యాలయంలో చంద్రశేఖరరెడ్డికి నియామక ఉత్తర్వులు అందజేశారు. అలాగే ప్రధాన మంత్రి మోదీ ప్రారంభించిన ‘లైఫ్ మిషన్’కు నోడల్ అధికారిగాను చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. పాత్రికేయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన చంద్రశేఖర్‌రెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్ సీఈవోగా పని చేశారు.