ఈడీ సోదాలపై హైకోర్టులో బీసీజీ కంపెనీ సవాల్‌

ABN , First Publish Date - 2023-10-03T03:54:36+05:30 IST

విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం(ఫెమా) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఇటీవల తమ ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోదా లు చేయడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీ బ్రైట్‌కాం గ్రూప్‌ (బీసీజీ) హైకోర్టును ఆశ్రయించింది.

ఈడీ సోదాలపై హైకోర్టులో బీసీజీ కంపెనీ సవాల్‌

హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం(ఫెమా) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఇటీవల తమ ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోదా లు చేయడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీ బ్రైట్‌కాం గ్రూప్‌ (బీసీజీ) హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ సోదాలు అక్రమమని పేర్కొంటూ కంపెనీతోపాటు సీఈవో సురేశ్‌కుమార్‌ రెడ్డి సైతం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం వివరణ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల17కు వాయిదా వేసింది.

Updated Date - 2023-10-03T03:54:36+05:30 IST