ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బక్కి వెంకటయ్య
ABN , First Publish Date - 2023-09-22T03:29:32+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. కమిషన్‌కు నూతన చైర్మన్, సభ్యులను సీఎం కేసీఆర్ నియమించారు.
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. కమిషన్‌కు నూతన చైర్మన్, సభ్యులను సీఎం కేసీఆర్ నియమించారు. కమిషన్ నూతన చైర్మన్‌గా మెదక్ జిల్లాకు చెందిన బక్కి వెంకటయ్య (ఎస్సీ మాల), సభ్యులుగా కుస్రం నీలాదేవి (ఎస్టీ గోండు, ఆదిలాబాద్), రాంబాబు నాయక్ (ఎస్టీ లంబాడా, దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ (ఎస్సీ మాదిగ, కరీంనగర్), జిల్లా శంకర్ (ఎస్సీ మాదిగ, నల్లగొండ), రేణికుంట ప్రవీణ్ (ఎస్సీ మాదిగ, ఆదిలాబాద్)ను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.