కన్నుల పండువగా అయ్యప్ప మహాపడిపూజ
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:30 PM
అయ్యప్పస్వామి నామస్మరణతో చండూరుపట్టణం మారుమోగింది. మంగళవారం పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో స్వామి వారి 32వ మహాపడి పూజ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు.
చండూరు, డిసెంబరు 26 : అయ్యప్పస్వామి నామస్మరణతో చండూరుపట్టణం మారుమోగింది. మంగళవారం పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో స్వామి వారి 32వ మహాపడి పూజ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. కట్ట అం జయ్య, మొమ్మరబోయిన వెంకటేశ్వర్లు, దోటి వెంకటేశ యాదవ్ ఆధ్వర్యంలో పడి పూజ దాత మాదగోని శ్రీనివాసులు 18 మెట్ల పూజ నిర్వహించారు. అంతకుముందు గణపతి పూజ, సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్పస్వామికి 18 రకాల అభిషేకాలు, 36 రకాల కలశ పూజ, నైవేద్యం, మహాహారతి అనంతరం 18 మెట్ల పడిని వెలిగించారు. పూజా కార్యక్రమాలకు పెద్దసంఖ్యలో అయ్యప్పస్వాములు తరలివచ్చారు. అయ్యప్పస్వామి భక్తి పాటలు, గీతాను ఆలపించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ కోడి గిరిబాబు, సముద్రాల వెంకన్న, డాక్టర్ కోడి శ్రీనివాసులు, సరికొండ వెంకన్న, గంగిశెట్టి మారయ్య, ప్రజాప్రనిధులు పాల్గొన్నారు.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి అభిషేకాలు
అడవిదేవులపల్లి : మండల కేంద్రంలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి మంగళవారం భక్తులు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. కోరిన కోరికలు నెరవేర్చే స్వామిగా ప్రతీతి. అభిషేకం అనంతరం స్వామివారిని ఆలయ అర్చకులు వెల్లటూరి రామ్మోహన నూతన వస్త్రాలు, పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో హాజరై తీర్ధప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
చెర్వుగట్టులో మాసకల్యాణం
నార్కట్‌పల్లి: మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మాసకల్యాణం నిర్వహించారు. ప్రతీ నెలా పౌర్ణమి తిథిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారి మాస కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. అర్చకుడు సురేశశర్మ కల్యాణతంతును జరిపించగా ఉత్సవంలో భక్తులు పాల్గొన్నారు.
మాండ్రలో హనుమతగాయత్రీ హోమం: మండలంలోని మాండ్రలోని హనుమాన ఆలయంలో హనుమత గాయత్రీ యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. యజ్ఞగుండంపై హనుమాన మాలధారులు కూర్చున్నారు. అర్చకులు ఉత్తరాపల్లి నర్సింహాచార్యులు, యాజ్ఞీకులు బేతోజు సత్యనారాయణశాసి్త్ర, శశిధర్‌శర్మ, విక్రమ్ శర్మలు పూజాధికాలు నిర్వహించారు. ఉత్సవంలో సర్పంచ దొండ సౌమ్యరమేశ, గుండు నర్సింహ, పున్న పాండు, గురజ సైదులు, వీరయ్య, సత్తయ్య, భరత, రాజు, వాసు, బిక్షం, లింగయ్య, భూపతిరెడ్డిలు పాల్గొన్నారు.