17 నుంచి ‘ఆయుష్మాన్‌ భవ’ కార్యక్రమాలు

ABN , First Publish Date - 2023-09-14T04:19:26+05:30 IST

దేశవ్యాప్తంగా ఆయుష్మాన్‌ భవ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని బుధవారం కేంద్రం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

17 నుంచి ‘ఆయుష్మాన్‌ భవ’ కార్యక్రమాలు

దేశవ్యాప్తంగా ఆయుష్మాన్‌ భవ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని బుధవారం కేంద్రం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈమేరకు బుధవారం వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ఎన్‌హెచ్‌ఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయుష్మాన్‌ భవలో భాగంగా ఈ నెల 20 నుంచి 27 వరకు అన్ని పల్లె, బస్తీ దవాఖానాలు, యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో హెల్త్‌ మేళాలను నిర్వహించనున్నారు. ఈ మేళాలల్లో బీపీ, షుగర్‌, కామన్‌ క్యాన్సర్‌ (ఓరల్‌, రొమ్ము, సర్వైకల్‌) స్ర్కీనింగ్‌, క్షయ, కుష్టు, హెపటైటీస్‌ బీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Updated Date - 2023-09-14T04:19:26+05:30 IST