సీబీఐ ముందుకు అవినాశ్‌

ABN , First Publish Date - 2023-06-11T03:00:21+05:30 IST

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి మరోసారి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు.

సీబీఐ ముందుకు అవినాశ్‌

కీలక అంశాలపై ప్రశ్నలు

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి మరోసారి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ముందస్తు బెయిల్‌ సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి శనివారం అవినాశ్‌ రెడ్డి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇందులో భాగంగా వరుసగా రెండోవారం ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని బెదిరించడం, రూ.4 కోట్ల నగదు లావాదేవీలతోపాటు సాక్ష్యాల తారుమారు, వాట్సాప్‌ కాల్స్‌ తదితర అంశాలపై అవినాశ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.

Updated Date - 2023-06-11T03:00:21+05:30 IST