అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ
ABN , First Publish Date - 2023-09-22T03:05:33+05:30 IST
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.
1న సీట్లపై నిర్ణయం: సీపీఐ, సీపీఎం
హైదరాబాద్, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. సీట్లపై చర్చించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో గురువారం సీపీఐ, సీపీఎం నాయకుల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కూనంనేని మీడియాతో మాట్లాడారు. అక్టోబరు 1న మరోసారి ఇరు పార్టీల భేటీ ఉంటుందని, కలిసి పోటీ చేసే స్థానాలను ఆ రోజు ప్రకటిస్తామని వెల్లడించారు. ఉమ్మడి సమావేశంలో కాంగ్రె్‌సతో పొత్తు అంశం చర్చకు రాలేదని తెలిపారు. కాంగ్రె్‌సతో పొత్తు వద్దనుకోవడం లేదని అన్నారు. అంగన్‌వాడీపై పోలీసుల దాడిని ఖండించారు. మహిళా బిల్లు వెంటనే అమల్లోకి వచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బిల్లులో ఓబీసీ కోటా ఉండాలని డిమాండ్ చేశారు.