ఆనం మీర్జా, అసదుద్దీన్ ఆవిష్కరించిన హ‌నీహ‌నీ కిడ్స్ స్టోర్

ABN , First Publish Date - 2023-06-18T00:44:49+05:30 IST

హైదరాబాద్‌లో హ‌నీహ‌నీ త‌న తొలి స్టోర్‌ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని అశోక్ వన్ మాల్‌లో దంపతులు ఆనం మీర్జా(సానియా మీర్జా సోద‌రి), మహమ్మద్ అసదుద్దీన్‌(క్రికెట‌ర్ అజారుద్దీన్ కుమారుడు) తన కుమార్తెతో కలిసి

ఆనం మీర్జా, అసదుద్దీన్ ఆవిష్కరించిన హ‌నీహ‌నీ కిడ్స్ స్టోర్

హైదరాబాద్‌లో హ‌నీహ‌నీ త‌న తొలి స్టోర్‌ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని అశోక్ వన్ మాల్‌లో దంపతులు ఆనం మీర్జా(సానియా మీర్జా సోద‌రి), మహమ్మద్ అసదుద్దీన్‌(క్రికెట‌ర్ అజారుద్దీన్ కుమారుడు) తన కుమార్తెతో కలిసి ఈ కిడ్స్ స్టోర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహమ్మద్ అసదుద్దీన్ మాట్లాడుతూ ఒక తండ్రిగా, నా బిడ్డ‌కు ఉత్త‌మ‌మైన వాటిని అందించ‌డానికి ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతాన‌న్నారు. హ‌నీహ‌నీలాంటి సంస్థ న‌గ‌రానికి రావ‌డం ప‌ట్ల త‌న‌లాంటి తండ్రులంద‌రికీ ఎంతో ఉప‌యోగ‌మ‌న్నారు. పిల్ల‌ల‌కు కావాల్సిన అన్ని ఉత్ప‌త్తుల‌ను ఇక్క‌డ కొనుగోలు చేసుకోనే వ‌న్‌స్టాప్ కేంద్రంగా ఇది నిలుస్తుంద‌న్నారు. ఆయన భార్య ఆన‌మ్ మీర్జా మాట్లాడుతూ.. మ‌న ఆలోచ‌న‌ల‌కు, అభిలాష‌కు అనుగుణ‌మైన ఉత్ప‌త్తుల‌ను ఇక్క‌డ లభిస్తాయని అన్నారు. గ‌ర్భిణీలుగా ఉన్న వారు, ప్ర‌స‌వించిన వారు, పిల్ల‌లున్న ప్ర‌తి త‌ల్లిదండ్రులు ఈ స్టోర్లో త‌మ‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఉత్ప‌త్తుల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌న్నారు. హ‌నీహ‌నీ సంస్థ బిజినెస్ హెడ్ శ్రీకాంత్ కొమర్ల, స్టోర్ నిర్వహకులు మల్లికార్జున్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో స్టోర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప‌రిమిత కాలంలో 70 శాతం రాయితీతో ఉత్ప‌త్తుల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. హ‌నీహ‌నీ స్టోర్‌లు త్వ‌ర‌లో నగ‌రంలో మ‌రిన్ని అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపారు.

Updated Date - 2023-06-18T00:44:57+05:30 IST