రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గట్లే!

ABN , First Publish Date - 2023-06-11T03:35:31+05:30 IST

మృగశిర కార్తెలోనూ ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. శనివారం కూడా సూరీడు తన ప్రతాపం చూపించాడు. అయితే అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు

రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గట్లే!

● నేడు, రేపు కూడా ఎండలు ఎక్కువే..వడదెబ్బతో ఒకరి మృతి

హైదరాబాద్‌/ఖానాపురం జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): మృగశిర కార్తెలోనూ ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. శనివారం కూడా సూరీడు తన ప్రతాపం చూపించాడు. అయితే అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఈసాలతక్కెళ్లపల్లి, ఆసిఫాబాద్‌ జిల్లా జంబుగలో 45.1, ఖమ్మం జిల్లా పమ్మిలో 44.6, జయశంకర్‌ జిల్లా మహాదేవ్‌పూర్‌లో 44.3 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావారణ కేంద్రం వెల్లడించింది. ఆది, సోమవారాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఇటు నైరుతి రుతుపవనాలు కేరళలోని అన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించినట్లు వివరించింది. కాగా, వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌కు చెందిన కూలీ యాకుబ్‌పాషా(46) వడదెబ్బ తగిలి మృతి చెందాడు.

Updated Date - 2023-06-11T03:35:31+05:30 IST