కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2023-05-02T00:26:51+05:30 IST
కృష్ణా నది ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన సోమవారం మండలంలోని వాడపల్లి వద్ద వెలుగుచూసింది.
కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
దామరచర్ల, మే 1: కృష్ణా నది ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన సోమవారం మండలంలోని వాడపల్లి వద్ద వెలుగుచూసింది. ఎస్‌ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.... వాడపల్లి వద్ద నది ఒడ్డున సుమారు 55 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహం ఉన్నట్లు మత్స్యకారులు గమనించారు. ఈ మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిర్వహించారు. అనంతరం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడు ముదురు గులాబీరంగు నిండు చేతుల చొక్కా ధరించి లుంగీతో ఉ న్నాడు. కుడి కాలు, కుడి చేతికి చేపలు పట్టే వల చిక్కుకొని ఉంది. చేపల వేటకు వెళ్లి మూడు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వివరాలు తెలిసిన వారు పోలీ్‌సస్టేషనలో సంప్రదించాలని ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.