రాష్ట్రానికి అమిత్ షా, నడ్డా!
ABN , First Publish Date - 2023-06-02T02:28:51+05:30 IST
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ నెలలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతల పర్యటనలు వేర్వేరు ప్రాంతాల్లో సాగనున్నాయి.
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ నెలలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతల పర్యటనలు వేర్వేరు ప్రాంతాల్లో సాగనున్నాయి. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నెల రోజుల పాటు బీజేపీ మహాజన్ సంపర్క్ అభయాన్‌లో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు పలు కార్యక్రమాలు, సభలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండు ప్రాంతాల్లో భారీ బహిరంగసభలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణల్లో ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న ఈ బహిరంగసభలకు అమిత్‌షా, జేపీ నడ్డాలు హాజరుకానున్నారు. ఎక్కడ, ఎప్పుడు ఈ సభలు ఏర్పాటు చేయాలన్నది ఒకటి, రెండు రోజుల్లో ఖరారు కానుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.