విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2023-01-26T01:19:06+05:30 IST

విద్యతో పాటు క్రీడలకు ప్రభు త్వం సమ ప్రాధాన్యం ఇస్తుందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో పోటీలను బుధవారం ప్రారంభించి మా ట్లాడారు. జీవితానికి విద్యతో వెలుగు లభిస్తే క్రీడలతో పోరాట స్ఫూర్తి లభిస్తుందన్నారు. సీఎం కేసీ ఆర్‌ చొరవతోనే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం లభిస్తుందన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో క్రీడలకు సరైన ప్రాధాన్యం లేకపోవడంతో విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి కొరవ డుతోందన్నారు. క్రీడలు పిల్లల శారీరక, మానసిక ధృడత్వానికి ఎంతగానో తోడ్పడుతున్నాయన్నారు.

విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం

విద్యార్థులు మొబైల్‌ గేమ్స్‌కు పరిమితం కావొద్దు

విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

సూర్యాపేటఅర్బన్‌, జనవరి 25: విద్యతో పాటు క్రీడలకు ప్రభు త్వం సమ ప్రాధాన్యం ఇస్తుందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో పోటీలను బుధవారం ప్రారంభించి మా ట్లాడారు. జీవితానికి విద్యతో వెలుగు లభిస్తే క్రీడలతో పోరాట స్ఫూర్తి లభిస్తుందన్నారు. సీఎం కేసీ ఆర్‌ చొరవతోనే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం లభిస్తుందన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో క్రీడలకు సరైన ప్రాధాన్యం లేకపోవడంతో విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి కొరవ డుతోందన్నారు. క్రీడలు పిల్లల శారీరక, మానసిక ధృడత్వానికి ఎంతగానో తోడ్పడుతున్నాయన్నారు. ప్రస్తుత కాలంలో మొబైల్‌ గేమ్‌లకు పరిమితమై, క్రీడలకు దూరమవుతున్న పిల్లలు అనారోగ్యానికి దూరమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీపీలు బీరవోలు రవిందర్‌రెడ్డి, నెమ్మాది బిక్షం, జడ్పీటీసీ జీడిబిక్షం, డీఈవో అశోక్‌, ఏడీ శైలజ, నాయకులు సవరాల సత్యనారాయణ, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్‌, ఉప్పల ఆనంద్‌ ఉన్నారు.

ఓటు నమోదు చేసుకోవాలి : మంత్రి

18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఒటు నమోదు చేసుకోవాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు గదులు ఇరుకుగా ఉన్నం దున అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించిన కొమ్ము ప్రశాంతికి ఉన్నత విద్యకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ పెరుమాళ్ళ యాదయ్య, కౌన్సిలర్‌ తాహేర్‌పాష, మద్దె మడుగు సైదు లు, శ్రీనివాస్‌, వెంకన్న, కృష్ణ, లింగం, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:19:11+05:30 IST