హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ అరాధే
ABN , First Publish Date - 2023-07-24T03:29:00+05:30 IST
లంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ అరాధే ప్రమాణం చేశారు. ఆదివారం రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణం చేయించారు.
ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై
కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్
హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా.. అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం
హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ అరాధే ప్రమాణం చేశారు. ఆదివారం రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, కే.కేశవరావు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ హాజరయ్యారు. అంతకుముందు చీఫ్ జస్టిస్ అలోక్ అరాఽధేకు సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళిసైకి కూడా కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి పలకరించారు.