‘మేడిగడ్డ’ ఇసుక తరలింపునకు అనుమతివ్వండి
ABN , Publish Date - Dec 28 , 2023 | 03:37 AM
కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో భాగంగా.. మహారాష్ట్ర వైపున బ్యారేజీ పిల్లర్ల వద్ద ఇసుకను తరలించడానికి తెలంగాణ ఆ రాష్ట్ర అనుమతి కోరింది.
మహారాష్ట్ర సర్కారుకు తెలంగాణ లేఖ
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో భాగంగా.. మహారాష్ట్ర వైపున బ్యారేజీ పిల్లర్ల వద్ద ఇసుకను తరలించడానికి తెలంగాణ ఆ రాష్ట్ర అనుమతి కోరింది. మేడిగడ్డ బ్యారేజీ 8 బ్లాకుల్లో మూడు బ్లాకులు మహారాష్ట్ర భూభాగంలో ఉన్నాయి. వాటిలోనే కుంగిన ఏడో బ్లాకు ఉంది. దాంతో పునరుద్ధరణకు ఉపక్రమించాలంటే పిల్లర్ల వద్ద ఇసుకను తరలించి కుంగుబాటుకు గల కారణాలను కుణ్ణంగా అధ్యయనం చేయాలి. అందుకు ఆ రాష్ట్ర అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం చేపడుతున్న కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులు రెండు నెలల పాటు సాగే అవకాశాలున్నాయి. ఆలోపు మహారాష్ట్ర నుంచి అనుమతులు పొంది ఇసుకను తరలించి కుంగుబాటుకు గల కారణాలను తెలుసుకోనున్నారు.