అన్నీ దారులు ఖమ్మం వైపు

ABN , First Publish Date - 2023-01-18T00:31:43+05:30 IST

ఖమ్మంలో బుధవారం నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ తొలి జాతీయ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పార్టీ శ్రేణులను భారీగా తరలించేందుకు పార్టీ నాయకులు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఖమ్మం జిల్లా పక్కనే ఉన్న సూర్యాపేట జిల్లా నుంచి 1.20లక్షల మందిని తరలించనున్నారు. దీనికి సం బంధించిన ఏర్పాట్లను మంత్రి జగదీ్‌షరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

అన్నీ దారులు ఖమ్మం వైపు

సభకు ఉమ్మడి జిల్లా నుంచి 1.50లక్షల మంది

సమరోత్సాహంతో సన్నద్ధమైన గులాబీసైన్యం

నల్లగొండ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మంలో బుధవారం నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ తొలి జాతీయ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పార్టీ శ్రేణులను భారీగా తరలించేందుకు పార్టీ నాయకులు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఖమ్మం జిల్లా పక్కనే ఉన్న సూర్యాపేట జిల్లా నుంచి 1.20లక్షల మందిని తరలించనున్నారు. దీనికి సం బంధించిన ఏర్పాట్లను మంత్రి జగదీ్‌షరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం నుంచి 30,000 మంది చొప్పు న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 1.20లక్షల మందిని తరలించనున్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి 30,000 మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గానికి 1,500 వ్యక్తిగత వాహనాలకు తగ్గకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చేలా పార్టీ నాయకులు ఆదేశించారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం సాయంత్రమే ఖమ్మం వెళ్లగా, సూర్యాపేట జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బుధవారం పార్టీ కార్యకర్తలతో రావాలని అధిష్ఠానం సూచించింది. జాతీయస్థాయిలో తొలి సభలో కేసీఆర్‌ చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లనున్నారు. అందుకు గులాబీ సైన్యం సమరోత్సాహంతో సన్నద్ధమైంది.

కొత్తతరం ఆకాంక్షలను నెరవేర్చేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టింది : గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి

కొత్తతరం ఆకాంక్షలను నెరవేర్చేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టింది. ఖమ్మం లో నిర్వహించే సభ నుంచే బీజేపీ అంతం ప్రారంభంకానుంది. 75 ఏళ్ల పాలనలో తరాలు మారిన లక్ష్యాలను చేరుకోవడంలో కాంగ్రెస్‌, బీజేపీ విఫలమయ్యాయి. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రంలో పాలన సాగలేదు. దేశం వెనుకబాటుతనానికి కారణం పాలకులు అవలంభిస్తున్న విధానాలే. తొమ్మిదేళ్ల పాలనలో దేశానికి ప్రధాని మోదీ ఒరగబెట్టింది శూన్యం. బీఆర్‌ఎస్‌ సభకు స్వచ్ఛందంగా వచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యనేతలు సభకు రానున్నారు. ఏపీ ప్రజలు కూడా బహిరంగ సభ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సభలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం.

ఐదు వేల మందిని తరలిస్తాం : కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు

ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాం. ఈ సభకు జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన మోత్కూరు, అడ్డగూడూరు మండలాల నుంచి సుమారు 100 వాహనాల్లో ఐదు వేల మందిని తరలిస్తాం. అదేవిధంగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వారి సొంత వాహనాల్లో ఆవిర్భావ సభకు తరలిరావాలని పిలుపునిచ్చాం.

Updated Date - 2023-01-18T00:31:55+05:30 IST