హామీలను అమలు చేసేందుకు చర్యలు

ABN , First Publish Date - 2023-08-22T01:24:52+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలపై చర్చించి త్వరలోనే వారికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్‌రెడ్డి అన్నారు.

 హామీలను అమలు చేసేందుకు చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న దామోదర్‌రెడ్డి

హామీలను అమలు చేసేందుకు చర్యలు

పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్‌రెడ్డి

నల్లగొండటౌన, ఆగస్టు 21: రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలపై చర్చించి త్వరలోనే వారికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్‌రెడ్డి అన్నారు. జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమస్యలపై మంత్రి హరీ్‌షరావుతో చర్చించామని, ముఖ్యమంత్రితో భేటీ అనంతరం సమస్యలు, హామీలపై క్లారిటీ వస్తుందన్నారు. పెన్షనర్లకు ముఖ్యంగా హెల్త్‌కార్డులు మంజూరుచేయాలని, పీఆర్సీ కమిషనను నియమించాలని, మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. 398 స్పెషల్‌ టీచన్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. అనం తరం రాష్ట్ర, జిల్లా బాధ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రా ష్ట్ర సెక్రటరీ సి.చంద్రశేఖర్‌, కోశాధికారి ఎ.గంగారె డ్డి, అసోసియేట్‌ అధ్యక్షుడు వి.విశ్వనాధం, ఉపాధ్యక్షుడు ఆర్‌.సీతారాము లు, జాయింట్‌ సెక్రటరీ శంకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు పెంటయ్య, లక్ష్మీనర్సింహరావు, ఈశ్వరయ్య, ప్రచార కార్యదర్శి బి.ప్రహ్లాదరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వెంకట్‌రెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T01:24:52+05:30 IST