నియామకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి

ABN , First Publish Date - 2023-06-03T00:57:27+05:30 IST

నీళ్లు, నిధులు, నియామకాలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ విద్యావంతు ల వేదిక జిల్లా అధ్యక్షుడు పందు ల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి క్లాక్‌టవర్‌ సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు.

నియామకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి

తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు

నల్లగొండ కల్చరల్‌, జూన్‌ 2: నీళ్లు, నిధులు, నియామకాలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ విద్యావంతు ల వేదిక జిల్లా అధ్యక్షుడు పందు ల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి క్లాక్‌టవర్‌ సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం 1,600 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే వచ్చిన రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఈ ప్రభుత్వంలో కనీస గౌరవం కూడా దక్కడంలేదన్నారు. ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌నేత బకరం శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ యువత కొట్లాడింది ఉద్యోగాల కోసమని, కానీ కనీసం ఇంతవరకు జంబో నోటిఫికేషన్‌ జారీ చేయలేదన్నారు. కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, తెలంగాణ ప్రదేశ్‌ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షమయ్య, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్థన్‌గౌడ్‌, మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు అద్దంకి రవీందర్‌, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రేకల సైదులు, బొజ్జ దేవయ్య, వెంకన్న, బొజ్జ నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:57:27+05:30 IST