విషాదం నింపిన విహార యాత్ర
ABN , First Publish Date - 2023-09-18T01:02:20+05:30 IST
రెండు రోజులు సెలవులు వచ్చాయి... నేను అమరావతి జలపాతాలను చూసి వచ్చిన తర్వాత పండక్కి వస్తానని తండ్రికి చెప్పిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఆదివారం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగిన రో డ్డు ప్రమాదంలో మండలంలోని మల్లేపల్లివారిగూడెం గ్రామానికి చెం దిన కోటేష్(26) మృతి చెందాడు.

విషాదం నింపిన విహార యాత్ర
మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిప్పర్తి వాసి మృతి
తిప్పర్తి, సెప్టెంబరు 17: రెండు రోజులు సెలవులు వచ్చాయి... నేను అమరావతి జలపాతాలను చూసి వచ్చిన తర్వాత పండక్కి వస్తానని తండ్రికి చెప్పిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఆదివారం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగిన రో డ్డు ప్రమాదంలో మండలంలోని మల్లేపల్లివారిగూడెం గ్రామానికి చెం దిన కోటేష్(26) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామా నికి చెందిన వనపర్తి పెద్దిరాములు, సునీత దంపతులు వ్యవసాయం చేస్తుండగా, కుమారు డు కోటేష్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కోటేష్ గతేడాది ఏపీజీవీబీ బ్యాంకులో ఉద్యోగం సా ధించి ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. తనతో పాటు కలిసి పనిచేసే బ్యాంకు మిత్రులతో కలిసి ఆదివారం మహారాష్ట్రలోని అమరావతి జలపాతాలను చూసేందుకు కిరాయి కారులో బయలుదేరారు. మార్గమధ్యలో తండ్రి పెద్ది రాములుకు ఫోన చేసిన కోటేష్ మిత్రులతో కలిసి మహారాష్ట్రలోని ఓ ప్రాంతానికి టూర్‌కి వెళ్తున్నానని, పండుగకు కూడా సెలవు ఉ న్నందున ఇంటికి వస్తానని తెలిపాడు. ఫోన చేసిన మరో నాలుగు గంటల అనంతరం మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్‌దరా అనే ప్రాంతంలో కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మందిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక వ్యక్తి అంబులెన్సకు సమాచారమివ్వటంతో అక్కడికి చేరుకున్న స్థానికులు, పోలీసులు మృతదేహాలను, క్షత్రగాత్రులను అంబులెన్స ద్వారా ఆసుపత్రికి తరలించారు. మృతుల ఫోనలో ఉన్న నెంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేతికందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు.