కళాశాల భవనం పై నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-11-10T04:58:43+05:30 IST
ఓ విద్యార్థి కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మేడ్చల్ టౌన్, నవంబరు 9: ఓ విద్యార్థి కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్లకు చెందిన సంజయ్(21) గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం సంజయ్ కళాశాలకు వెళ్లి తిరిగి హాస్టల్‌కు రాలేదు. దీంతో తోటి విద్యార్థులు అతని కోసం వెళ్లి చూడగా అప్పటికే సంజయ్ కళాశాల భవనం నాలుగో అంతస్తు నుంచి దూకడంతో గాయాలపాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.