పాలిసెట్‌లో 72.69 శాతం సీట్ల భర్తీ

ABN , First Publish Date - 2023-06-26T02:19:44+05:30 IST

రాష్ట్రంలో పాలిసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లను ఆదివారం కేటాయుంచారు. మొత్తం సీట్లలో 72 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.

పాలిసెట్‌లో 72.69 శాతం సీట్ల భర్తీ

జూలై15 నుంచి తరగతుల ప్రారంభం

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాలిసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లను ఆదివారం కేటాయుంచారు. మొత్తం సీట్లలో 72 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్రస్తుతం సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 29లోపు ఫీజు చెల్లించి ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్‌ సీట్ల కోసం ఈసారి నిర్వహించిన పాలిసెట్‌లో సుమారు 80,358 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా వీరిలో 25,160 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొని ఆప్షన్లను నమోదు చేసుకున్నారు. వీటి ఆధారంగా అధికారులు ఆదివారం సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో 56 ప్రభుత్వ, 60 ప్రైవేట్‌ కలిపి 116 పాలిటెక్నిక్‌ కాలేజీలుండగా.. వీటిలో మొత్తం 29,396 సీట్లున్నాయి. మొదటి విడతలో 21,367 సీట్ల (72.69 శాతం)ను కేటాయించారు. మరో 8,029 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈడబ్ల్యుఎస్‌ కోటాలో 580 సీట్లను భర్తీ చేశారు. ప్రైవేట్‌లో 2, ప్రభుత్వంలో 2 కాలేజీల్లో మొత్తం సీట్లు భర్తీ అయ్యాయి. తుది విడత కౌన్సెలింగ్‌ను జూలై 7 నుంచి 10లోపు నిర్వహించనున్నారు. కాలేజీల్లో ఓరియెంటేషన్‌ తరగతులను జూలై 7 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. 15 నుంచి రెగ్యులర్‌ తరగతులను నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు.

Updated Date - 2023-06-26T02:19:44+05:30 IST