కన్వీనర్‌ కోటాలో 62 వేల సీట్లు

ABN , First Publish Date - 2023-06-28T04:17:07+05:30 IST

ఈ ఏడాది కన్వీనర్‌ కోటాలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో 62,079 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కన్వీనర్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల పరిధిలో మొత్తం 80,091 సీట్లు ఉన్నాయి....

కన్వీనర్‌ కోటాలో 62 వేల సీట్లు

ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో మొత్తం 80 వేల సీట్లు

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది కన్వీనర్‌ కోటాలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో 62,079 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కన్వీనర్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల పరిధిలో మొత్తం 80,091 సీట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు సంబంధించినవే! రాష్ట్రంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఆయా కాలేజీల్లో కోర్సుల వారీగా సీట్ల వివరాలను అధికారులు మంగళవారం ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 155 ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 70 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలో, మిగిలిన 30 శాతం సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేస్తారు. కాగా, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు చదవడానికే విద్యార్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. దాంతో ఈ సీట్ల సంఖ్య పెరుగుతూ ఇతర కోర్సుల్లో సీట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 16,617 సీట్లు ఉన్నాయి. దీని తర్వాత ఆ స్థాయిలో ఎలక్ర్టానిక్స్‌ విభాగంలో 10,394 సీట్లు ఉన్నాయి. సివిల్‌ ఇంజనీరింగ్‌లో 3,567 సీట్లు, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 3,147 సీట్లు ఉన్నాయి.

Updated Date - 2023-06-28T04:17:07+05:30 IST