రాష్ట్ర అప్పులు 3,66,306 కోట్లు

ABN , First Publish Date - 2023-07-25T03:05:06+05:30 IST

తెలంగాణ అప్పులు 2023 మార్చినాటికి రూ.3,66,306 కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

రాష్ట్ర అప్పులు 3,66,306 కోట్లు

న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అప్పులు 2023 మార్చినాటికి రూ.3,66,306 కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. సోమవారం బీఆర్‌ఎస్‌ లోక్‌సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. రాష్ట్ర జీఎ్‌సడీపీలో అప్పుల శాతం 2022-23లో 16.6 శాతానికి చేరుకుంది. అలాగే తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్‌ అప్పులు 2022-23లో రూ.7,525 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్‌) కింద కూడా 2022-23లో రూ.1,305 కోట్ల అప్పులు చేసిందన్నారు.

Updated Date - 2023-07-25T03:05:06+05:30 IST