నా 34 ఏళ్ల సర్వీసులో ఇంతటి అభివృద్ధిని ఎప్పుడూ చూడలేదు: సీఎస్‌

ABN , First Publish Date - 2023-06-11T03:33:19+05:30 IST

తన 34 ఏళ్ల సర్వీసులో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని గతంలో ఎప్పుడూ చూడలేదని సీఎస్‌ శాంతికుమారి అన్నారు. ప్రతి అధికారి, ఉద్యోగి అంకిత

నా 34 ఏళ్ల సర్వీసులో ఇంతటి అభివృద్ధిని ఎప్పుడూ చూడలేదు: సీఎస్‌

తన 34 ఏళ్ల సర్వీసులో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని గతంలో ఎప్పుడూ చూడలేదని సీఎస్‌ శాంతికుమారి అన్నారు. ప్రతి అధికారి, ఉద్యోగి అంకిత భావంతో పని చేయడమే ఈ అభివృద్ధికి కారణమని చెప్పారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో తొమ్మిదేళ్లలో దేశంలో మరే రాష్ట్రం సాధించని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో సుపరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. నీటి పారుదల, వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, సంక్షేమం, సుపరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణ వంటి రంగాల్లో రికార్డు స్థాయిలో పురోగతి నమోదైందన్నారు.

Updated Date - 2023-06-11T03:33:19+05:30 IST